Wednesday, January 16, 2019

మా నాన్నగారు_ బొమ్మలకొలువు ( 2)posted

కొలువులో మెట్లు పెట్టినప్పుడు పై మూడు మెట్లు కూడా దేవీ దేవతా విగ్రహాల తోనే నింపే వాళ్ళం... ఆ మెట్ల వెంట ఆరి వెలిగే బల్బు లైటింగ్ పెట్టడం బొమ్మలన్నీ ముఖాలు కనిపించే లాగా ఉండాలంటూ నాన్నగారు వాటిని అమర్చేవారు.. మేము విరిగిన బొమ్మల్ని బాగు చేసినప్పుడు వాటితో కొత్తగా ఏదైనా తయారు చేసినప్పుడు ఆయన చాలా సంతోషించేవారు. కాకినాడలో ఉన్నప్పుడు చాలా మంచి కొలువు ఏర్పాటు చేశాము
              
             మెట్ల కన్నా చుట్టూ పల్లెటూరి వాతావరణం.. కోసం పండగ కన్నా ముందుగానే ఆవాలు పెసలు లాంటివి రాత్రి నానబోసి ఒక పూటంతా చిల్లుల పళ్లెంలో వదిలేసే వాళ్ళం .మొలకలు వచ్చేవి .బట్టలకు వచ్చిన అట్ట పెట్టెల్లో మట్టి నింపి వాటిలో ఈ మొలకలు చల్లే వాళ్ళం.. రెండు మూడు రోజుల్లో మొలకలు బాగా పైకి వచ్చి చేను లాగా అనిపించేది. ఆ చేను మధ్యలో నాలుగు పుల్లలు తో పందిరి వేసి మంచె కట్టేవాళ్ళం.. అంతేనా ఏదో ఒక మూలలో ఇసక ఎత్తుగా పోసి మెట్లు గట్టి పైన గుడి ఏర్పాటు చేసే వాళ్ళం.. అప్పట్లో తీర్థాలలో ఐదు పది రూపాయలకు స్కూటర్లు గుర్రబ్బండి కార్లు లారీలు ప్లాస్టిక్ బొమ్మలు వచ్చేవి.. ఏవి చూసినా ఒక ఐడియా తో కొలువులోకి అలా అయితే బాగుంటాయి ఇలా అయితే బాగుంటాయి అంటూ బొమ్మలు చాలా కొనేవాళ్ళం

             ఒకసారి రోడ్డు మీద పెట్టిన పింగాణీ బొమ్మలలో ఒక టి సెట్ నాకు చాలా నచ్చింది. ఆది కొనమని ఇంటికి వచ్చి  ఒకటే పేచి నాన్న కి ఇక కొనక తప్పలేదు ఇదే కాకుండా బువ్వాలాటల సామాన్లు స్టీలు గ్యాస్ స్టవ్ కుక్కరు వాటితో సహా రెండు బిందెలు  ఇవన్నీ కూడా స్టీలు సామాను షాప్ లో చూసి కొనే వరకు గొడవ చేస్తే నాన్న ...అమ్మా నువ్వు ఇంటర్ కి వచ్చావే.. బువ్వాలాటల బొమ్మలు కావాలా అని నవ్వుతూనే ఆయనకి నచ్చి కొనేశారు పైగా ఇంటికి వచ్చి అమ్మతో రెండు స్టీలు బిందెలు తెచ్చాను నీళ్లు పట్టుకోవచ్చు అని అవి చూపించి నవ్వారు ఆ సామానుతో మా అమ్మాయి ఆడుకునేది దాంట్లో కత్తిపీట విరిగిపోతే మా వారు రివిట్ చేయించడం కొసమెరుపు

                      విచిత్రం ఏమిటంటే నన్ను బొటానికల్ టూర్ కి సౌత్ ఇండియా అంతా తిప్పినప్పుడు అందరు పిల్లలు రకరకాల చంప పిన్నులు రబ్బర్ బాండ్లు గొలుసులు చీరలు కొనుక్కుంటే నేను మాత్రం మద్రాస్ లో పింగాణీ బొమ్మలు కొన్ని కొని జాగ్రత్తగా ప్యాక్ చేసి పట్టుకొచ్చాను అంతేకాదు ఒకసారి ఏటికొప్పాక కూడా వెళ్ళాము అక్కడ కొయ్య బొమ్మలు చాలా ఫేమస్ అక్కడ నుంచి రకరకాల పిట్టలు ఫ్యామిలీ సెట్.. దీనిలో నాన్న బొమ్మ లోపల అమ్మ అమ్మ లోపల ఒక పాప ఒక బాబు ఉంటారు ఇలాంటివే ముసుగు అమ్మాయిల బొమ్మలు ఉండే అమ్మాయిల సెట్ కూడా ఉంది.. ఏటికొప్పాకలో చిన్నచిన్న పిట్టలు చాలా అందంగా ఉండేవి లక్కపిడతలు చాలా కొనుక్కుని వచ్చాను.
అసలు సంగతి మరిచాను మా అక్క పూసలతో కుర్చీలు సోఫాలు. ఉయ్యాలలు అమ్మాయిల బొమ్మలు అప్పట్లో చాలా అల్లేవారు చూసిన అన్నీ కూడా అది అల్లుతానని అడిగితే నాన్న ఆ పూసలు వైర్లు అన్నీ అమర్చి పెట్టేవారు అది అల్లిన వాటిని చూసి మురిసిపోయేవారు.. ఇవే కాకుండా పాత నైట్ బల్బులని బోర్లించిన కొబ్బరి చిప్ప మీద పెట్టి బ్రాహ్మణుడు క్రైస్తవుడు ముస్లిం బొమ్మలు తయారు చేసే వాళ్ళం... అక్క ఆ బల్బు షేపు చూసి దేనికి వాడితే బాగుంటుంది చెప్పి ఆ బొమ్మ తయారు చేసేది.. తాటి టెంకలు తెల్లగా మెరిసిపోయేలా కడిగి
వాటితో రుషులు మునులు తలకాయలు తయారు చేసేది... 
              కోడిగుడ్డు గుల్లలు మా నా స్నేహితుల దగ్గర అడిగి తెచ్చుకుని నీళ్ళలో పోసి తెల్లగా కడిగి వాటిమీద ఐడ్రాపర్ అంటించి నిలువుగా నుంచోపెట్టి పక్కన నల్ల రంగు వేసి పెంగ్విన్లు తయారుచేసింది నిజంగా చాలా గొప్ప సృజనాత్మకత ఉండేది దానికి... ఈ మధ్యనే అంతర్జాలంలో  న్యూస్ పేపర్ల గొట్టాలతో బొమ్మలు తయారుచేయడం చూసి నేను చేసి అక్కకు చూపించాను అది ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా బొమ్మలు చాలా చేస్తోంది

       బొమ్మల కొలువుకి మేము పిలిచిన పేరంటాలు కాకుండా నాన్న ఆఫీస్ లో కూడా మా పిల్లలు బొమ్మలు పెట్టారని మామూలు కొలువు కాదు వాళ్ళు చాలా సృజనాత్మకంగా తీర్చిదిద్దారని చెప్పి వాళ్ల కొల్లీగ్స్ నీ ఆఫీసులో ఆడవారిని కూడా పిలిచేవారు మొత్తానికి ఒకసారైతే ఎవరో వచ్చి చూస్తారని తొమ్మిది రోజులు దాటినా కూడా తీయని ఇవ్వలేదు హారతి ఇప్పించి
ఒక బొమ్మ కదిపి వాళ్ల కోసం అలాగే ఉంచారు..
    

              పెళ్లి అయ్యాక అత్తవారింటికి వచ్చి వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు ఆనవాయితీ లేదు అన్నప్పుడు నా బాధ అంతా ఇంతా కాదు... నిజంగా చాలా బాధ వేసింది... అయితే మధ్యలో ఒకసారి స్కూల్ లో తెలుగు భాష ఉత్సవాలు చేసి పిల్లలకి అన్ని పండుగల ఆనవాయితీలు తెలిసేలా గా కార్యక్రమం చేయమంటే నేను టీచర్లు అందరితో కలిసి చాలా పెద్ద బొమ్మల కొలువు ఒక పార్కు వినాయక చవితి పందిరి గ్రామీణ వాతావరణం జంతుప్రదర్శనశాల అన్ని ఏర్పాటు చేసి పిల్లల చేత చాలా బొమ్మలు కూడా కాగితాలతో తయారు చేయించి నా ఇష్టాన్ని ఆ విధంగా తీర్చుకున్నాను

        ఇప్పుడు మా మేనకోడలు తో దసరా బొమ్మల కొలువు కి హాజరై చాలా ఏళ్ల జ్ఞాపకాలని మీతో పంచుకుంటున్నాను నాన్న ఉంటే మనవరాలి బొమ్మల కొలువు చాలా మురిసి వుందురు . ఈ ఫోటోలో కనిపించే జిరాఫీలు కుర్చీ టేబుల్ మా అక్క చేసిన న్యూస్ పేపర్ బొమ్మలు అలాగే నేను చేసిన కొబ్బరి చిప్ప బల్బులు బొమ్మలు పెడుతున్నాను.
     నిన్న నా పోస్ట్ కి ఎంతో ఎంతో ఆదరంతో చదివి మీ కామెంట్లు జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా సుసర్ల శాస్త్రి గారు పండగ హడావుడి వల్ల రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది అయినా మీ స్పందన మాకెంతో ఆనందం. నిన్నే మీ అందరి కామెంట్లు మా అమ్మాయి కూడా చదివి అందరూ చాలా బాగా రాస్తున్నారు అమ్మా అని మెచ్చు కుంది..
మరి ఉంటాను
మీ తల్లాప్రగడ శ్రీదేవి

Sunday, November 4, 2018

Happy folding!మా నాన్నగారు--- మా బొమ్మల కొలువు(1)posted

మా మొట్టమొదటి బొమ్మలకొలువు నెల్లూరులో బాగా చిన్నతనంలోనే పెట్టించారు ఒక సందుగా పెట్టి మీద
మంచి చీర కప్పి 12 ప్లాస్టిక్ బొమ్మలు యు ఆకారంలో అమర్చి మా మొదటి బొమ్మలకొలువు జరిగింది ఆ ప్లాస్టిక్ బొమ్మలు కూడా కింద చిన్న నల్లటి పెట్టి లాంటిది ఉండేది. దాని మీద బొమ్మ నటరాజు, వెంకటేశ్వర స్వామి, బిడ్డకి పాలిస్తున్న తల్లి, అందంగా నీళ్లు ఒలకబోస్తున్న కన్నె పిల్ల, చేత వెన్న ముద్ద తో కృష్ణుడు , శివపార్వతులు... ఆ బొమ్మలు దంతంతో చేసినట్లుగా ఉండేవి.... వాటి నీ ఎంచుకోవడంలో నాన్నగారి కళాత్మక దృష్టి తెలిసేది. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం బొమ్మలకొలువు బొమ్మలు పెరుగుతూ ఉండేవి
   
కొండపల్లి బొమ్మ ఒకటి స్టాండ్ మీద నిలబడి తాకగానే వయ్యారంగా ఊగుతూ డాన్స్ చేస్తూ ఉండేది.. అప్పట్లో ఈ బొమ్మ చాలామంది ఇళ్లలోనే ఉండేది. కొయ్య బొమ్మలు  రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు.. లేపాక్షి అంబారి ఏనుగు.. లక్క ఏనుగులు మీద గాజు అద్దాలు అంటించి చాలా అందంగా ఉండేవి.. ఎగ్జిబిషన్లలో మేము ఎంత గోల పెట్టి ఏడ్చినా నాన్న సెలక్షన్ చాలా క్లాస్ గా ఉండేది ఆ బొమ్మలు తెచ్చి మేము షోకేస్ లో పెడితే అందరూ అడిగే వారు ఎక్కడ కొన్నారు అని..
   
           విశాఖ ఎగ్జిబిషన్లో నాన్న కొన్న  ఒక బెంగాలీ తాత మామ్మగారు బొమ్మలు చాలా అందంగా ఉండేవి మెడకి చిన్న స్ప్రింగ్ ఉండి ఊగుతూ తాతగారి చేతిలో గొడుగు భగవద్గీత మామ్మగారి చేతిలో హ్యాండ్ బ్యాగ్ చక్కటి కొప్పు తో మంచి జరీ అంచు చీర తో ఆ రెండు బొమ్మలు చాలా ముద్దుగా ఉండేవి.. ఇవి నాన్న తెచ్చినప్పుడు మేము నాన్నగారు అమ్మ మీరు ముసలి అయితే ఇలా ఉండాలి అంటే అమ్మ ఆయన కూడా ముసిముసినవ్వులు.. ఆ బొమ్మలు ఎప్పుడు తీసినా నవ్వుకునే వాళ్ళం

         బొమ్మల కొలువు పెట్టినప్పుడల్లా ఏవో కొన్ని బొమ్మలు విరగడం వాటిని రిపేరు చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది మాసిన బొమ్మలకు రంగులు వేయడం. ఒకసారి మేము కొన్న బ్యాండ్ మేళం మేళగాళ్లు అందరి కాళ్ళు చేతులు విరిగిపోయేయి ఆ బొమ్మలకి విరిగిన చోట తెల్ల కాగితాలు అంటించి హాస్పిటల్ లో పేషెంట్ లాగా తయారు చేసి ఒక మిలటరీ హాస్పిటల్ లాగా పెట్టాము 

      అలాగే అక్క దూదితో కోళ్లు తయారు చేసేది వాటితో కోళ్ల ఫారం బేసిన్ లో నీళ్ళు పోసి కడిగిన కోడిగుడ్డు గుల్లలు ఐడ్రాపర్ లు ఉపయోగించే చేసిన బాతులు వేసేవాళ్ళం..
        
            మరిచేపోయాను అప్పట్లో బినాకా టూత్ పేస్ట్ డబ్బాలో చిన్న చిన్న జంతువుల బొమ్మలు ఇచ్చేవాళ్ళు ఆ బొమ్మల కోసం ఆ పేస్టు కొనిపించి బొమ్మలన్నీ దాచే వాళ్ళం వాటన్నిటినీ పెట్టి ఒక జంతుప్రదర్శనశాల తయారు చేసే వాళ్ళం. పాయింట్ అనే ఒక రకం సర్ఫ్ కూడా వచ్చేది దాని మీద ఒక చిన్న పాప బొమ్మ లోపల బొమ్మకు తగిలించే కాగితపు గౌనులు ఉండేవి. అవి కూడా నాన్న ఎంతో శ్రద్ధగా మా అందరి మధ్యలో కూర్చుని తయారుచేసి సంబరపడేవారు ఆ పేస్టు సర్ఫ్ కంపెనీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి
            
              అదేమిటో బొమ్మలకొలువు పెట్టగానే రకరకాల ఐడియాలు బుర్రలో పుట్టుకొచ్చేవి.. చీపురు కట్ట వెనుక ఉండే ఇనుప గొట్టాన్ని చెక్క ముక్కకి దిగేసి పురికొస చుట్టి దానికి నల్ల రంగు వేసి ఆ గొట్టంలో కాగితంతో తాటియాకులు కత్తిరించి వేసి నలుపు గోధుమ రంగు పూసలు ని తాటి కాయలు గా వైరు చుట్టి దానికి తగిలించేవాళ్ళం.. అలాగే పూతిక చీపురు పుల్లలు అంటించి ఇళ్ళు.. 
          
            ఇంటర్నెట్ లేని రోజుల్లోనే అగ్గిపెట్టెలతో అట్టపెట్టెలతో సోఫాలు కుర్చీలు ఇళ్ళు అనేకం తయారు చేసే వాళ్ళం... నలుగురు పిల్లలం ఈ పనిలో ఎంతో బిజీ గా ఉండే వాళ్ళం... ఫెవికాల్.... జిగురు లాంటివి తెలియనే తెలియవు మైదాపిండి ఉడికించి అంటించడమే.. అమ్మని నిమిష నిమిషానికి పిండి ఉడికించి ఇమ్మని పీక్కుతినే వాళ్ళం
     
    దసరా సెలవులు ఇవ్వక ముందు నుంచి కొలువులో ఏమేమి పెట్టాలి ఎక్కడ ఎక్కడ పెట్టాలి అని వాదనలు ప్రతిపాదనలు జోరుగా జరిగేది మెట్లు కాకుండా పొలాలు... పల్లెలు గుళ్లు... అన్నీ ప్లాన్ చేసుకునే వాళ్ళం....ఇలాంటి వాటిలో పెట్టడానికి ఎక్కువగా తీర్థాల్లో కొన్న కార్లు సైకిల్ బస్సులు ఇలాంటివి ఎక్కువ వాడేవాళ్ళం... కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళ దగ్గర మట్టి అడిగి తెచ్చి ఒకచోటంతా టార్పాలిన్ పరిచి దానిమీద మట్టి పోసి.. ఒక చిన్న పల్లెటూరు నగర వాతావరణం సృష్టించేవాళ్ళం.. పొలాల మధ్య ఇళ్ల మధ్యన రోడ్లు కోసం ఇటుకలు బొగ్గులు మెత్తగా నూరి ఎర్ర మట్టి రోడ్లు తారు రోడ్లు వేసేవాళ్ళు...

      అమ్మ ఒక్కొక్కసారి తొమ్మిది రోజులు ఒక్కొక్కసారి మూడు రోజులు పేరంటం పెట్టేది మేము ఎక్కువ కష్టపడి పెట్టినప్పుడు తొమ్మిది రోజులు ఉంచే వాళ్ళం... అమ్మ ఆ రోజుల్లో పిల్లలకి పెట్టడానికి అటుకులు బెల్లం కొబ్బరి ఉండలు గాని రవ్వ లడ్డు గాని శనగల గుగ్గిళ్ళు పులిహార పరవాన్నం పిండి పులిహార శనగపప్పు కొబ్బరి పోపు వేసి లేదా పెసరపప్పు వేసి  రకరకాలుగా చక్కగా చేసేది. ఇవి పెట్టడానికి బాదమాకు లు అరిటాకులు ఎలాగో ఒక లాగ సేకరించే వాళ్ళం
(రేపు మరి కొంచెం బొమ్మలకొలువు విశేషాలు చెప్తాను నేను ఇంకా హుషారుగా రాయాలంటే మీ కామెంట్ల లడ్డూలు చాలా అవసరం.. మరి ఉంటాను)
మీ తల్లాప్రగడ శ్రీదేవి

Thursday, May 24, 2018

Quilled 3D Lord Venkateswara

Venkateswara Lord Venkateswara with quilling strips
Happy folding!

Paper Park made by government school children

Happy foldi
A paper Park made by my school children with my suggestions for a science fair exhibition

My exhibition as an artist in my school in my village

The beautiful kusudama balls


Origami animals and dolls modular
Vase with origami flowers
The vase modules are folded by me 70 years old mother



 These are the newspaper African dolls

My quilling ornaments
Happy folding! At my birth place the small village the small village razole conducted an exhibition in my own school it's a great experience To me and my sister

Wednesday, October 25, 2017

How to draw 20 different emotions



Happy folding!

Saturday, January 19, 2013

Happy folding!

Monday, April 9, 2012

Quilling Me Softly: Contrast Veined Combed Leaf Tutorial

Quilling Me Softly: Contrast Veined Combed Leaf Tutorial

Happy folding!really it inspired me to do it

Wednesday, November 9, 2011






Happy folding!
Happy folding!